
రుతు పవనాల ఆలస్యంపై ప్రధాని సమీక్ష శ్రీనీటి నిల్వలను సమర్థంగా నిర్వహించుకోవాలి
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి శ్రీప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ, జూన్ 26 (జనంసాక్షి) :వర్షాభావ పరిస్థి తులతో మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ యేడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయని, మరో రెండు నెలల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళిక రచించాలన్నారు. వ్యవసాయ పనులు కూడా వాటికి అనుగుణంగా తయారు చేసుకోవాల న్నారు. రుతుపవనాల స్థితిగతులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని 500 జిల్లాల కొరకు అత్యవసర ప్రణాళిక సిద్ధం చేసినట్లు మోడీ తెలిపారు. ఖరీఫ్ కాలంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాలని, కేంద్ర, రాష్ట్రాల సమన్వయం, ముందస్తు కార్యాచరణ అవసరమని మోడీ పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ నిందితులపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. బ్లాక్ మార్కెట్ కేసు లను త్వరగా విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయ స్థానా లు ఏర్పాటు చేయాలని ప్రధాని
అభిప్రాయపడ్డారు. బాక్ల్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్రమోడీ అన్నారు. బ్లాక్ మార్కెట్ కేసుల త్వరిత విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయలన్నారు. దేశంలో రుతుపవనాల రాక ఆలస్యంపై ఆయన స్పందిస్తూ ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. మరో రెండు నెలల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చు. దేశంలోని 500 జిల్లాలకు అత్యవసర ప్రణాళిక సిద్ధం చేశాం. కష్ట కాలంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాలి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, ముందస్తు కార్యాచరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. దీనిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పాటించాలన్నారు.
రానున్నది గడ్డుకాలం




