29నుంచి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

రాజమండ్రి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): అండర్‌-19 జూనియర్‌ బాలురు, బాలికల రాష్ట్రస్ధాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ఆగస్టు 29 నుంచి నిర్వహిస్తున్నట్టు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు కొడాలి తనూజ తెలిపారు. టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెపారు. గతంలో రాజమహేంద్రవరంలో సబ్‌ జూనియర్‌ పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించామని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాజమహేంద్రవరానికి ఈసారి అండర్‌-19 టోర్నమెంట్‌ కేటియించినట్టు చెప్పారు. గతంలో నిర్వహించిన సబ్‌ జూనియర్‌ టోర్నమెంట్‌ మన జిల్లా క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ఎంతో మంది రాష్ట్రస్థాయి క్రీడాకారులు తయారవడానికి దోహద పడిందన్నారు. ఇప్పుడు నిర్వహించే అండర్‌-19 టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్ధాయిలో దేశం తరపున ఆడే అవకాశం కలుగుతుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం వల్ల పరిసరప్రాంత క్రీడాకారులకు ఎక్కువుగా పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. తద్వారా వారు మంచి క్రీడాకారులుగా అభివృద్ధి చెందడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు డిసెంబర్‌ 16 నుండి, 22 వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో జరిగే 43వ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు.

తాజావార్తలు