3వేల పాఠశాలలకు పుస్తకాల విరాళం

సుధామూర్తి స్ఫూర్తిదాయక నిర్ణయం

అమరావతి,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 3వేల పాఠశాలలకు పుస్తకాలను విరాళంగా అందజేయాలని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, తితిదే ట్రస్టు బోర్డు సభ్యురాలు సుధామూర్తి నిర్ణయించారు. మొత్తం రూ.2.50 కోట్ల విలువైన పుస్తకాలను విరాళంగా అందించనున్నారు. గతంలో ఏ స్వచ్ఛంధ సంస్థ కూడా ఇంత భారీ స్థాయిలో పుస్తకాలను విరాళంగా అందజేయలేదు. సామాజిక బాధ్యతలో భాగగంఆ పాటవాలకు పుస్తకాల వితరణ చేయాలని నిర్ణయించారు. సుధామూర్తి దాతృత్వానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నానికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సహకారం మరిచి పోలేనిదని సీఎం కొనియాడారు.

తాజావార్తలు