Monday, 2 November 2026

రూ.30 కోట్ల ప్రజాధనంతో ప్రమాణమా?

jagan
రాజధానికి చందాలడుగుతో ఇంత దుబారానా?
బాబు అట్టహాసంపై జగన్‌ ధ్వజం
రాజమండ్రి, జూన్‌ 7 (జనంసాక్షి) :ఓ వైపు రాజధాని నిర్మాణం కోసం చందాలు పోగుచేస్తూ, ప్రమాణ స్వీకరానికి డబ్బు దుబారా చేస్తారా అని వైకా పా నేత జగన్‌ ప్రశ్నించారు. రాజధాని కోసం ఐదు, పదివేలు ఇమ్మని అడు గుతూ ప్రమాణం కోసం కోట్లు ఖర్చు చేయడం అవసరామా అని ప్రశ్నిం చారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నా రు. ఈ దుబారాలో తాను భాగస్వామి కాదల్చుకోలేదని, అందుకే ప్రమాణ స్వీకారానికి వెళ్లడం లేదని జగన్‌ తేల్చి చెప్పారు. ఇక బాబు రుణమాఫీ ప్రకటన బోగస్‌ అన్నారు. దీనివల్ల ఎప్పటి నుంచి రుణమాఫీ అన్నది తెలియదన్నారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం డ్రామా అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏ తేదీ నుంచి రుణాలు మాఫీ అవుతాయో చెబితేనే తొలి సంతకానికి అర్థం ఉంటుందన్నారు. రుణమాఫీపై ఎల్లో మీడియా, చంద్రబాబు ఓ పథకం ప్రకారం డ్రామా నడిపిస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. కొత్త రాజధానికి డబ్బులు లేవని ఓవైపు చందాలు అడుగుతున్న ఆయన మరోవైపు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి సమయంలో ఏ అవసరం లేకున్నా అంత ఖర్చు చేయడం ఎందుకని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. రూ.5వేలు, రూ.10వేలు కూడా రాజధాని కోసం విరాళాలు అడుగున్నవారు ప్రమాణ స్వీకారానికి అంత ఖర్చు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. అటువంటి కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదని జగన్‌ అన్నారు. ఆ వృథా ఖర్చులో తాను భాగస్వామిని కాలేనని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తేవాలని తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని జగన్‌ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి అంశంపైనా పోరాడుతామని ఆయన తెలిపారు.తాము అధికారం కోల్పోయినందుకు సమీక్ష చేయలేదని సంస్థాగత తప్పులను అధిగమించడంపై చర్చించినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. రాజమండ్రి ఆర్‌అండ్బీ అతిథిగృహంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓడిన స్థానాల్లో ఎందుకు దెబ్బ తగిలిందో విశ్లేషించుకున్నామని ఆయన చెప్పారు. తాము గతంలో ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి 9 మంది ఎంపీలు, 70మంది ఎమ్మెల్యేలకు తమ పార్టీ సంఖ్య పెరిగిందన్నారు. ఇకముందు విపక్షంగా తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్నారు.
ముంపునకు వ్యతిరేకంగా
నిప్పంటుకుంటున్న పోలవరం
నేతలు ధర్నా నిర్వహించారు. ఉదయమే ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని అఖిలపక్ష నేతలు కొద్దిరోజులుగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే శనివారం రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలతో పాటు గిరిజనులు ఉదయం 8 గంటలకే రోడ్లపైకెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురయ్యే ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తలపెట్టిన రోడ్ల దిగ్బంధనంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనలు విరమించాలని అఖిలపక్షనేతలను సముదాయించారు. వారు వినకపోవడంతో రోడ్ల దిగ్బంధనాన్ని అడ్డుకొని భగ్నం చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌ రద్దు చేయలని డిమాండ్‌ అఖిలపక్షం, ఆదివాసీ సంఘాలు తలపెట్టిన రహదారుల దిగ్బంధం ఉద్రిక్తంగా మారింది. ఆర్డినెన్స్‌కు నిరసనగా ఉదయం రహదారుల దిగ్బంధ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రహదారులను దిగ్బంధించాలని అఖిల పక్షం నిర్ణయించింది. అయితే పోలీసులు అక్కడకు చేరుకుని గంటలలోపే రహదారుల దిగ్బంధనాన్ని అడ్డుకుని భగ్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై మండిపడ్డారు. ముంపు గ్రామాలను ఆంధప్రదేశ్‌లో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం జిల్లా సరిహద్దులను దిగ్బంధం చేపట్టినట్టు సీపీఐ ఎం.ఎల్‌. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, తెరాస నాయకులు బేగ్‌ తెలిపారు. అఖిలపక్షం పిలుపుతో తాము తమ నిరసన చేపట్టామన్నారు. ఏడు మండలాల్లో లక్షలాది మంది ప్రజలకు తీవ్ర నష్టం వాటించే ఆర్డినెన్స్‌కు చట్టరూపం తేకుండా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టునున్నట్లు హెచ్చరించారు. పార్టీలకతీతంగా ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ, ప్రజాసంఘాలు సహకరించారని అన్నారు. ఆదివాసీల జీవనాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పోలవరం డిజైన్‌ను మార్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమను అడ్డుకున్నా సమస్య సమసి పోదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *