
17న సమ్మె విరమించే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 15 (జనంసాక్షి) :
అలవికాని కోర్కెలతో కృత్రిమ సమ్మెకు దిగిన ఏపీఎన్జీవోల ఖేల్‌ఖతం కానుంది. ఈనెల 17న ఎన్జీవోల సమ్మెకు మంగళం పాడనున్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ఏపీఎ న్జీవోలు సమ్మె కొన సా గించిన విషయం తెలిసిం దే. ఇటీవల పై-లిన్ తు పాను సమయంలో సహా యక చర్యల్లో పాల్గొం టా మని ప్రకటించిన ఎన్జీ వో సమ్మె మాత్రం విర మించబోమన్నారు. అయితే సీఎం అలసత్వంతోనే వారు అలా మాట్లాడుతున్నట్టు తేలిపోయింది. ఈనేపథ్యంలో ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకొని వారితో సమ్మె విరమింపజేయాలని సీఎంను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరపనున్నట్టు ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సచివాలయంలో సీఎం కార్యాలయం రాజకీయ కార్యదర్శి శివశంకర్‌తో అశోక్‌బాబు, మరికొన్ని సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఆ రోజు జరగనున్న సమావేశంలో ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చే హామీని బట్టి సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బుధవారం కొన్ని ఉద్యోగ సంఘాలతోను, గురువారం ఉదయం పలు సంఘాలతోను చర్చలు జరపనున్నా మని, ఆ చర్చల్లో సీఎంకు తెలియజేయాల్సిన అంశాలపైన.. సీఎం హామీ ఇస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంపైన చర్చించనున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ప్రధాన డిమాండు అని చెప్పారు. అందుకోసమే 62రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, ప్రభుత్వ హామీ మేరకు ఉపాధ్యాయులు తమ ఆందోళనను విరమించారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉద్యోగులు తమ ఆందోళనను విరమించారన్నారు. ఉద్యోగులు సమ్మెలో ఉన్నప్పటికీ పైలిన్ తుపాను సందర్భంగా ప్రజలకు సేవలందించేందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్, పలు విభాగాల ఉద్యోగులు విధులకు హాజరయ్యారన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే నెలాఖరుకల్లా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయ కుల మద్దతు కోరనున్నట్టు వెల్లడించారు. రాజకీయ లబ్ది కోసమే కేంద్రం రాష్ట్రాన్ని విభజించేందుకు పూను కున్నదన్నారు. ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీఎన్జీవోల ఖేల్‌ఖతం




