జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్
జమ్ము, డిసెంబర్ 5 (జనంసాక్షి) :
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీి 370 ఆర్టికల్‌పై చేసిన వ్యాఖ్యలపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఘాటుగా స్పందించారు. దీనిపై చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. అవసరమైతే 370 ఆర్టికల్‌పై చర్చకు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు వస్తానని సవాల్ విసిరారు. జమ్ములో గురువారం జరిగిన షేక్ అబ్దుల్లా 108 వ జయంతి సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 370 ఆర్టికల్‌పై నరేంద్రమోడీకి అవగాహన లేదని కనీసం దానిని ఆయన ఇంతవరకు చదువనట్లు ఉన్నారని అన్నారు. 370 ఆర్టికల్‌లో జమ్ము కాశ్మీర్ ప్రజల ఆస్తుల హక్కు, స్థిర నివాసం చట్టాలపై ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ఆర్టికల్‌ను పూర్తిగా చదువకుండానే… అర్థం చేసుకోకుండానే మోడి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టికల్‌పై మోడీకి కనీస పరిజ్ఞానం లేదని ఒమర్ అబ్దుల్లా ఎద్దేవా చేశారు. పై చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఈ ఆర్టికల్ కాశ్మీర్ ప్రజలను భారతదేశంలో కలుపుతోందని ఆయన అన్నారు. నరేంద్రమోడీ వీటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండానే మాట్లాడాతున్నారని అన్నారు. జమ్ము, కాశ్మీర్ ప్రజల గురించి చాలా తక్కువ తెలుసునని అన్నారు. వారి గురించి ఆయన ఇప్పటికైనా తెలుసు కోవాలని ఒమర్ అన్నారు. జమ్ములోని షియా ప్రజల గురించి మోడీకి ఏమాత్రం తెలియదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అలాంటి వ్యక్తి వారి గురించే మాట్లాడే అర్హత లేదన్నారు. జమ్మ్ము కాశ్మీర్ ప్రజల మోడీ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేసాయని అన్నారు. గుజ్జర్లకు ఎస్టీ హోదా కల్పించిన ఏకైక రాష్ట్రం జమ్ము కాశ్మీర్ అని అన్నారు. మోడీ డిసెంబర్ 1న తన జమ్ము పర్యటనలో పండిట్స్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. కానీ పండిట్స్ కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పోరాడుతూనేఉందని అన్నారు. పండిట్స్ లేకుండా కాశ్మీర్‌ను చూడలేమన్నారు. వారు కాశ్మీర్ వ్యాలీకి రావాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్సిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము ఎప్పుడు ప్రజలను విభజించలేమని.. వారిన కష్టాల్లోకి నెట్టమని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
బస్తీమే సవాల్ 370పై చర్చకు అహ్మదాబాద్‌లో సిద్ధం




