‘రాయల’కు వ్యతిరేకంగా బంద్ సంపూర్ణం
హైదరాబాద్, డిసెంబర్ 5 (జనంసాక్షి) :
రాయల తెలంగాణ ప్రదిపాదనను తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలోని పది జిల్లాల్లో బంద్ విజయవంతంగా సాగింది. గురువారం ఉదయం నుంచే అన్ని బస్సు డిపోల ముందు తెలంగాణవాదులు ఆందోళనలకు దిగారు. కార్మికులే స్వచ్ఛందంగా బస్సులను బయటకు తియ్యకుండా నిలిపి వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ర్యాలీచేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో గర్జించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఉద్రిక్తంగానే కొనసాగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో టిఆర్‌ఎస్ నేతలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ఆరుగంటలపాటు ఆందోళనసాగినా కూడా పోలీసులు కూడా శాంతియుతంగానే ఉన్నారు. సుమారు ఆరు కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. టీఆర్‌ఎస్‌తో పాటు బిజెపి, సిపిఐ పార్టీల కార్యకర్తలు ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. రోడ్డెక్కి నిరసన ర్యాలీలు చేపట్టారు. బంద్ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు ముందస్తుగానే బంద్‌కు మద్దతు ప్రకటించాయి. కళాశాలలు, విద్యాసంస్థలు అన్నీ మూసి వేశారు. యూనివర్శిటీల్లో జరుగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. సినిమా హాళ్లు, పెట్రోల్‌బంక్‌లు, బ్యాంక్‌లు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు మూత పడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు శాతం తగ్గిపోయింది. బంద్‌కు సింగరేణి కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించడంతో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని 32 అండర్‌గ్రౌండ్ మైన్‌లతోపాటు 15 ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నియోజకవర్గ ఇంచార్జి శివకుమార్, పట్టణ ఇంచార్జి ఎండి యాకూబ్, ఎండి ఖాజా తదితరులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మెదక్ జిల్లాలో టిఆర్‌ఎస్ నాయకులు ఉదయం 5గంటలనుంచి జలదీక్షకు దిగారు. వరంగల్ జిల్లాలో జీవోఎం రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ టీఆర్‌ఎస్, జేఏసీ ఇచ్చిన బంద్ వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్‌కు వ్యా పార, వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నగరంలోని సినిమాహాల్స్, పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ, ఆటో కార్మికులు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జేఏసీ నేతలు బంద్‌లో పాలుపంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు బస్‌డిపోలకే పరిమితమ య్యాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం హైదరాబాద్, భద్రాచలంతో కూడి పది జిల్లాల తెలంగాణకే అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని, రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌తో కూడిన పదిజిల్లాల తెలంగాణ రాష్ట్రం కోసం, పది జిల్లాల తెలంగాణే లక్ష్యంగా ఉద్యమించడంతో పాటుగా ఆత్మబలిదానాలు జరిగాయని విద్యార్థి సంఘాల నాయకుడు విజయ్ అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ టీఆర్‌ఎస్, జేఏసీ ఇచ్చిన బంద్ వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మికులు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాలుపంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం హైదరాబాద్, భద్రాచలంతో కూడి పది జిల్లాల తెలంగాణకే అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని, రాయలతెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని విద్యార్థి సంఘాల నాయకుడు విజయ్ హెచ్చరించారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థ మొత్తం బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఒక్కరోజు బంద్‌తో సింగరేణికి నాలుగు జిల్లాల్లో సుమారు 20కోట్లకు పైగా నష్టం కలిగింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థపై తీవ్ర భారం పడింది. ఇప్పటికే వార్షిక లక్ష్య సాధనలో వెనుకంజలో ఉన్న సింగరేణి సంస్థలో మరింత వెనక్కి నెట్టినట్లే ఈబంద్ ప్రభావం చూపించింది. నగరంలోని కాళోజీసెంటర్ నుంచి అమరవీరుల స్తూపం వరకు జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీలను నిర్వహించి ధూంధాం, రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా విద్యార్థులు అమరవీరులకు నివాళులు అర్పించి జై తెలంగాణ అని నినదించారు. పదిజిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేదంటే తెలంగాణలో యుద్ద వాతావరణం నెలకొంటుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం విజయభాస్కర్ హెచ్చరించారు. కరీంనగర్‌లో స్థానిక ఎమ్మెల్యే కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు తెల్లవారు జామునుంచే రోడ్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తొలుత ఆర్టీసి బస్‌స్టాండ్ వద్ద భైఠాయించిన గంగుల ఇతర నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆందోళనకారులకు ఆర్టీసి సిబ్బంది, కార్మికులు సైతం మద్దతు ప్రకటించడంతో పాటు ఆందోళనకారులతో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ చౌక్‌లో వివిధ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశాయి. పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఒకానొక సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నగరంలోని అన్ని రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి. ఒక్క బస్సు కాని ఆటోగాని తిరగక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో…
రాయల తెలంగాణప్రతిపాదనకు వ్యతిరేఖంగాకెసిఆర్ పిలుపునిచ్చిన బంద్‌మేరకు వరంగల్ జిల్లాలో సంపూ ర్ణంగా బంద్ కొనసాగుతుంది వరంగల్‌జిల్లా నర్సంపేటలో బంద్ కొనసాగుతుంది. ఈబంద్‌లో ఆర్‌టిసి కార్మి కులు స్వచ్చందం బంద్‌లో పాల్గొనడంతో బస్సులుడిపోకె పరిమితమైయ్యయి. పెట్రోల్ బంకులు, వ్యాపార వాణిజ్యసంస్థలు స్వచ్చందంగా బంద్‌పాటిస్తుండగా బంద్‌ను ప్రకటించుకున్నాయి. తమకు హైదరాబాద్ రాజ దానితో కూడినప పదిజిల్లాలతో కూడిన తెలంగాణకావాలే తప్పరాయల తెలంగాణ మాకొద్దంటు తెలంగాణ వాదులు కేంద్ర ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ వరంగల్‌లో ఉద్యమం మళ్లీఉధృతం అయింది.
కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో…
రాయల తెలంగాణ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తెరాస అధినేత కెసిఆర్ పిలుపు మేరకు తెలంగాణ బంద్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో సంపూర్ణంగా జరుగుతుంది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో రాయల తెలం గాణకు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్‌అధినేత కేసిఆర్ పిలుపు మేరకు బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొంటున్నారు. పట్టణంలోని బస్‌డిపో ముందు టిఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణవాదులు ఉదయమే బస్సులను బయటకు రాకుండా గేటుముందు ధర్నాచేసి అడ్డుకున్నారు. పట్టణంలోని పలు వ్యాపార వాణిజ్య సముదాయాలు, పెట్రోల్‌బంక్‌లు, సినీమా హాళ్లు, స్కూళ్లు తెలంగాణ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బంద్‌ను విజయవంతం చేస్తున్నారు. హైదరాబాద్, భ్రదాచలంలతో కూడిన 10జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ఏర్పాటుచేయాలని, రాయల పేరుతో వేరే జిల్లాలను కలిపితే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురికాక తప్పదని టిఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో…
రాయల తెలంగాణను వ్యతిరేకిస్తు తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ స్వచ్ఛదంగా బంద్ పాటిస్తున్నారు. ఆర్.టి.సి. ఉద్యోగులు బంద్లో పాల్గొనటంతో 120 బస్సులు నిలిచిపోయాయి. పెట్రోల్ పంప్‌లు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు బంద్ పాటించటంతో నిర్మల్ నిర్మానుశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, 10జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే మాకు కావాలని డిమాండ్ చేశారు.
పది జిల్లాల్లో స్తంభించిన పౌరజీవనం




