Monday, 2 November 2026

అగ్ని-4 విజయవంతం

బాలాసోర్‌, జనవరి 20 (జనంసాక్షి) :
భారత వాయుసేన అమ్ములపొదిలో మరో క్షిపణి చేరింది. డీఆర్‌డీవో అగ్ని-4 బాలస్టిక్‌ మిస్సైల్‌ను సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఉదయం 10.52 గంటలకు ఒడిశా తీర ప్రాంతంలోని బాలాసోర్‌ పరిశోధన స్థానం నుంచి దీనిని ప్రయోగించారు. భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు అవినాశ్‌ చందర్‌ ఈ ప్రయోగాన్ని వీక్షించారు. డీఆర్‌డీవో పోర్ట్‌బ్లేయర్‌, చండీపూర్‌, బాలాసోర్‌, పారాదీప్‌ల నుంచి తన ప్రయోగాలను విజయవంతంగా కొనసాగిస్తుందని తెలిపారు. అగ్ని-4 17 టన్నుల బరువు, 20 మీటర్ల ఎత్తు ఉందని, ఏకకాలంలో రెండు క్షిపణులను మోసుకుపోతుందని తెలిపారు. కార్యక్రమంలో రవి గుప్తా, డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, వాయుసేన అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *