Monday, 2 November 2026

గ్రూప్‌-1 మెయిన్స్‌ మళ్లీ నిర్వహించండి

సుప్రీంలో ఏపీపీఎస్సీకి చుక్కెదురు
న్యూఢిల్లీ, జనవరి 20 (జనంసాక్షి) :
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించింది. 2011 గ్రూప్‌-1 పరీక్షకు హాజరుకాని ఏడు వేల మందిని మినహాయించి మిగతా వారందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. పరీక్షల్లో తప్పులు దొర్లినందున అభ్యర్థులు నష్టపోకూడదని కోర్టు అభిప్రాయపడింది. తప్పులు దొర్లిన కారణంగా నష్టపోయిన 209 మందిని ఈసారి నిర్వహించే మెయిన్స్‌లో చేర్చాలని కూడా ఆదేశించింది. దీంతో సుప్రీంలో ఊరట లభిస్తుందనుకున్న ఏపీపీఎస్సీకి చుక్కెదురైంది. సుప్రీం కోర్టు తీర్పుపై 209 మంది అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు దొర్లాయని అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *