Tuesday, 3 November 2026

బియాస్‌ నదిలో 4 మృతదేహాలు వెలికితీత

కొనసాగుతున్న గాలింపు
హైదరాబాద్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో ఆదివారం మరో నలుగురు విద్యార్థుల మృతదేహాలు వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకూ లభించిన మృతదేహాల సంఖ్య 17కు చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరకు చేపట్టిన గాలింపులో మూడు మృతదేహాలు లభించగా.. ఆ తర్వాత మరో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహాలు.. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన పరమేశ్వర్‌, వరంగల్‌ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి అఖిల్‌, హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన రుత్విక్‌, ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌లవిగా గుర్తించారు. 15 రోజులుగా జరుగుతున్న గాలింపులో 17 మృతదేహాలు లభించగా.. మరో ఏడుగురు విద్యార్థుల మృతదేహాల ఆచూకీ ఇంకా దొరకలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *