40ఏళ్ల రాజకీయ అనుభవం ఏమైంది..?
రాజకీయ డ్రామాలు ఆపి ఇకనైనా ఏపీ ప్రయోజనాలకోసం పోరాడాలి
హోదాపై రాజ్యసభలో నోటీస్ ఇచ్చాం
హోదా ఎవరు ఇస్తే వారికి మామద్దతు ఉంటుంది
– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, జులై23(జనంసాక్షి) : ప్రత్యేక ¬దా, విభజన హావిూలపై రాజ్యసభలో నోటీస్ ఇచ్చామని, ఈ వారంలో కచ్చితంగా చర్చకు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడుతూ.. ¬దా సాధించే విషయంలో టీడీపీకి చిత్తశుద్ది లేదని విమర్శించారు. అసలు ఏపీకి ప్రత్యేక ¬దా సాదించాలన్న తపనగానీ.. ఏదైనా ఒక ప్రణాళిక గానీ.. టీడీపీకి ఉందా? అంటూ ప్రశ్నించారు. గతంలో వైసీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. విరుద్ధంగా ఈ సమావేశాలలో స్వీకరించారు. మే 26, 2014 లో మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని.. మే 26 సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు క్యాబినెట్ లోకి ప్రవేశించారని తెలిపారు. అలాగే.. మార్చి8, 2018లో బీజేపీ భాగస్వామ్యం నుంచి టీడీపీ బయటికి వచ్చిందని వెల్లడించారు. సెప్టెంబర్ 2016లో చంద్రబాబు కోరిక మేరకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందని కూడా వివరించారు. అంతేకాకుండా.. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించి ఉంటే ఆంధప్రదేశ్ రాష్ట్రానికి పర్మినెంట్ గా అన్నిదారులు మూసుకుని పోయేవని తెలిపారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకే ఆర్థిక సాయం ప్రకటించారని, ఈ ప్యాకేజీకి ధన్యవాద తీర్మానం కూడా చేశారని గుర్తుచేశారు. ఇంతకీ ఈ ధన్యవాద తీర్మానాన్ని చంద్రబాబు విత్‌డ్రా చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. ప్యాకేజీపై ధన్యవాద తీర్మానం ఎలా పెట్టారని నిలదీశారు. నాలుగేళ్లు కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కాదా? అని, ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని టీడీపీ కోరలేదా అని మండిపడ్డారు. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించి ఉంటే హైకోర్టులో వ్యాజ్యం కూడా పెద్ద పొలిటికల్ డ్రామానే అని దుయ్యబట్టారు. ఆర్టికల్ 300 ప్రకారం సుప్రీం కోర్టులో కేసు వేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడికి పోయిందని, రాజకీయ డ్రామాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. బీజేపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా రాష్టాన్రికి ద్రోహం చేశాయన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిందే చంద్రబాబు అని తెలిపారు. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టారని, ఇప్పుడు ఆ కిరణెళి విభజన హావిూలపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ¬దా ఎవరిస్తే వారికే తమ పార్టీ మద్దతు ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.