హైదరాబాద్, జూన్ 2 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె. చంద్రశేఖర్‌రావు తొలి రోజే కొత్త రాష్ట్రంలో 40 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. మహిళా శాఖ కార్యదర్శిగా సునీల్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కె. రామకృష్ణారావు, ఐటీ కార్యదర్శిగా హర్‌ప్రీత్ సింగ్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్‌గా జయేశ్ రంజన్‌కు అదనపు బాధ్యతలు, ఉన్నత, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా వికాస్‌రాజ్, దేవాదాయ శాఖ కార్యదర్శిగా బి. వెంకటేశ్‌వర్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఎన్. శివశంకర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ఎం. జగదీశ్వర్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బి.కిశోర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పార్థసారథి, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌గా జీడీ అరుణ, హౌసింగ్ శాఖ కార్యదర్శిగా బి. వెంకటేశంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు అప్పగించారు. అలాగే 27 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోపస్ అదనపు డీజీగా రాజీవ్ త్రివేది, విజిలెన్స్ డైరెక్టర్‌గా అమిత్‌గార్గ్, పోలీసు సిబ్బంది వ్యవహారాల అదనపు డీజీగా ఉమేశ్ షరాఫ్, జైళ్ల శాఖ డీజీగా వీకే సింగ్, ఎన్‌పీఎఫ్ డీజీగా తేజ్‌దీప్ కౌర్, శాంతి భద్రతల ఐజీగా రాజీవ్ రతన్, సీఐడీ అదనపు డీజీగా కృష్ణప్రసాద్, రైల్వేస్ ఐజీగా కేటీ ఉజేలా, పోలీసు శిక్షణ ఐజీగా స్వాతి లాక్రాలకు పోస్టింగ్‌లు ఇచ్చారు.




