Tuesday, 3 November 2026

45 ఏళ్ల మహిళను కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లి అత్యాచారం… బాలికపై సోదరుడూ….

కామాంధులకు కన్నూమిన్నూ కానరావడంలేదు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో మూడు రోజుల క్రితం నాగప్ప కాలనీలో దారుణం జరిగింది. ఆ కాలనీలో నివాసముంటున్న 45 ఏళ్ల మహిళ మంగళవారం తన ఇంటిలో నిద్రిస్తోంది. ఆ రోజు తెల్లవారు జామున మస్తానయ్య అనే వ్యక్తి సదరు మహిళ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఆమెపై కామాంధుడు విరుచుకుపడి కోర్కె తీర్చమని అన్నాడు. ఐతే ఆమె ససేమిరా అనడంతో ఆమెను కొట్టుకుంటూ పక్కనే ఓ పాఠశాల ఆవరణలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
ఇంకోవైపు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 35 ఏళ్ల వ్యక్తి తన చెల్లెలు వరుసైన 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాటి ముంజలు కోసి ఇస్తానని చెప్పి శివారులోని పొలలాకు తీసుకెళ్లి ఆమెను భయపెట్టి పలుమార్తు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడమే కాకుండా ఆ విధంగా ఆమెను బెదిరిస్తూ 10 రోజుల పాటు అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయాన్ని పెద్దలకు చెప్పుకోలేదు. 
ఐతే ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. విషయం చెప్పి బాలిక బోరుమంది. తన కుమార్తెకు జరిగిన అన్యాయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె గర్భవతి అని తేలడంతో ఊరి పెద్దలకు విషయాన్ని చేరవేశారు. ఐతే విషయం బయటకు రావడంతో నిందితుడు పరారయ్యాడు. దీనితో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *