
హరీశ్
హైదరాబాద్, అక్టోబర్ 27 (జనంసాక్షి):
ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వ హించేందుకు కిరణ్ ప్రభుత్వం రూ. 45 కోట్లు వృథాగా ఖర్చు చేస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హ రీష్ రావు ఆరోపించారు. ఆదివారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడు తూ అవతరణ వేడుకల కోసం ప్రభుత్వం రూ. 45 కోట్లు కేటాయించాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది దుర్మార్గమని అన్నారు. ఓ వైపు విభజన జరుతుంటే ఇప్పుడు అవతరణ వేడుకలు జరపడం దారుణమన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ వేడుకలకు అంత మొత్తంలో నిధులెందుకు కేటాయిస్తున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకటనల కోసం కేటాయించిన నిధులను అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతులకు కేటాయించాలని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు. కిరణ్ కిమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన నాటి నుంచి జేడబ్ల్యూటీ యాడ్ ఏజెన్సీకి వందల కోట్ల రూపాయిలు కేటాయించారని హరీష్‌రావు ఆరోపించారు. ఆ సంస్థకు సీఎం తమ్ముడికి ఉన్న సంబంధమేంటో గవర్నర్‌తో విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ.హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలోని వేల ఎకరాల పత్తి, వరి పంట నీట మునిగిందని చెప్పారు. అలాగే ఇళ్లు కూలిపోయాయన్నారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వన్ని మరోసారి డిమాండ్ చేశారు. అలాగే ఎకరాకు రూ. 10 వేలు చొప్పున రైతులకు ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు. అధికారం కోసమే జగన్ డ్రామాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్రలో ఆధిపత్యం కోసమే చంద్రబాబు, జగన్, కిరణ్ యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ముగ్గురు రాష్టాన్ని అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను దోచుకోవడానికే జగన్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. చరిత్ర తెలుసుకుని జగన్ మాట్లాడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్రం విడిపోతే జగన్‌కు 30 ఎంపీ స్థానాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. జగన్‌కు మతి భ్రమించినట్లుందని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడులకు రూ.45 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం




