Tuesday, 3 November 2026

అధికారం కోసం మీ అయ్య గులాబీ కండువా కప్పుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలే: వీహెచ్‌


హైదరాబాద్‌,
అక్టోబర్‌ 27 (జనంసాక్షి):
తెలంగాణ వేర్పాటు వాదానికి భీజం వేసింది సోనియాగాంధీ కాదని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్న సంగతిని గ్రహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ అధికారం కోసం గులాబీ కండువా కప్పుకున్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని చూపించేందుకే జగన్‌ హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభను నిర్వహించారన్నారు. జగన్‌ సభకు రైళ్లను కేటాయించిన విషయంపై కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని వివరణ కోరనున్నట్లు తెలిపారు. బస్సులకు ఎలా అనుమతి ఇచ్చారో కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాలన్నారు. సీమాంధ్రలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అక్కడి ప్రజల నుండి అధిక డబ్సులు వసూలు చేస్తుంటే ఆర్టీసీ బస్సులను జగన్‌ సభకు ఇవ్వడమేమిటన్నారు. సోనియాను విమర్శించి జగన్‌ మరింత పాపాన్ని మూటకట్టుకున్నారని అన్నారు. సోనియాను విమర్శిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు నోరుమెదపకపోవడం విచారకరమని విహెచ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *