Tuesday, 3 November 2026

గుంటూరు జిల్లాలో రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ప్రత్తిపాడు,(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పోలీసులు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు మండలం బొర్రవారిపాలెంలో చెక్‌పోస్ట్‌ వద్ద శనివారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీ చేస్తుండగా వాహనంలో తరలిస్తున్న రూ.50 లక్షలు పట్టుకున్నారు. ఈ డబ్బును ప్రకాశం జిల్లా చీరాల నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *