విపక్షాలు విమర్శలు మానండి
మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 17 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రభుత్వం రీయంబర్స్‌మెంట్ బకా యి రూ.500 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వాల వైఫల్యమే బకాయిలకు కారణమని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. విపక్షాలు విమర్శలుమాని ప్రభుత్వంతో సహక రించాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ సర్కా ర్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయ త్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాల్లో ఉన్న వారు కూడా విమర్శలు చేయడం దారు ణమన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయి లను తక్షణం రూ.500కోట్లు విడుదల చేస్తు న్నామని అన్నారు. సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బకాయిపెట్టిన వాటిని ఇప్పుడు విడుదల చేస్తున్నామని అన్నారు. గతంలో పాలన చేసిన వారు తమ తప్పులను కప్పిపుచ్చుకుని ఇప్పుడు విమర్శలు చేయడం దారుణమన్నారు. వారి తప్పులను సరిచేస్తున్న క్రమంలో ఈ బకాయిలు విడుదల చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాలకు అన్ని తెలుసు.. కావాలనే తమపై బురద జల్లు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విూరు చేసిన తప్పుడు పనులను సంస్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. విమ ర్శలు చేయడం మాని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. తెలంగాణ లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చింది. తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం దీనిపై సిపారస్ లో చేయగా, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారు. తదనుగుణంగా ముందుగా ఇంజనీరింగ్ తదితర కాలేజీలకు ప్రభుత్వం బకాయిపడిన ఫీజులను మూడు విడతలుగా చెల్లిస్తారని సమాచారం.తొలుత ఐదువందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, దీపావళి తర్వాత మరో ఐదువందల కోట్ల రూపాయలు ఇస్తారని మంత్రి చెబుతున్నారు. ఈ ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలపై గత కొంతకాలం గా అటు విద్యార్ధులు, ఇటు కాలేజీలు ఆందోళన చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకోసం కోట్లాడిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ అభివృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణను అడ్డుకున్న వారే ఇవాళ విమర్శలు చేస్తున్నారని మంత్రి పడ్డారు.





