Tuesday, 3 November 2026

ఉద్రిక్తత నేపథ్యంలో త్రివిధ దళాలతో ప్రధాని భేటీ

modi
దేశభద్రతపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 (జనంసాక్షి) :
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యారు. దేశ భద్రతపై వారితో ప్రధాని సమీక్షించారు. చైనా, పాకిస్తాన్‌ దేశాలతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోడీ మిలిటరీ కమాండర్లతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ ప్రధాని పదవి చేపట్టాక.. మొదటిసారి అత్యున్నత స్థాయి మిలిటరీ కమాండర్లతో సమావేశమయ్యారు. శుక్రవారం రక్షణ శాఖ వార్‌ రూంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులతో మోడీ సమావేశమై.. సరిహద్దుల్లో పరిస్థితిపై చర్చించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన టాప్‌ కమాండర్లతో ప్రధాని కంబైన్డ్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో సమావేశం కావడం ఇదే తొలిసారి. భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. సరిహద్దు భద్రతోపాటు పాక్‌ ఆగడాలతోపాటు చైనా చొరబాట్లపై ప్రధానంగా సమావేశం దృష్టిసారించినట్లు తెలిసింది. భారత్‌లో అల్‌ఖైదా విభాగాన్ని స్థాపించనున్నట్లు వెలువడిన ప్రకటనతో పాటు దేశంలో ఐఎస్‌ఎస్‌ వ్యాప్తికి సంబంధించిన అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి, పాక్‌ దాడికి సంబంధించిన వివరాలను ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌సింగ్‌ మోడీకి తెలిపినట్లు సమాచారం. ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ అరూప్‌ రాహ తొలుత మోడీకి భద్రతకు సంబంధించిన వివరాలు తెలుపగా, ఆ తర్వాత నేవీ చీఫ్‌ అడ్మైరల్‌ ఆర్‌కే ధావన్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌సింగ్‌ ప్రసంగించారు. అనంతరం మోడీ, రో శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ త్రివిధ దళాలను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, ¬ం మంత్రి రాజనాథ్‌సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే మాధూర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *