6నుంచి ఫ్యాప్టో ఆందోళన
కాకినాడ,ఆగస్ట్4(జనం సాక్షి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో పిలుపు మేరకు జిల్లాలో ఆగస్టు 6, 7, 8 తేదీల్లో జాతా జరుగుతుందని యుటిఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కెఎస్‌ఎస్.పసాద్ తెలిపారు.సిపిఎస్ రద్దుకు ఈ జాతా నాంది పలకాలని, ఆ స్థాయిలో ఉద్యమం చేయాలని పిలుపిచ్చారు. తుని నుండి రావులపాలెం వరకు జరిగే మూడు రోజుల జాతాను, ఆగస్టు 11న విజయవాడలో జరిగే ర్యాలీ బహిరంగ సభలను విజయవంతం చేయాలని కోరారు.