Wednesday, 4 November 2026

ఏప్రిల్‌ 6న స్థానిక ఎన్నికలు

ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఒకేసారి
నేడు షెడ్యూల్‌
ఏప్రిల్‌ 6న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు
హైదరాబాద్‌, మార్చి 9 (జనంసాక్షి) :
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆ ఎన్నికలకు వారం రోజుల వ్యవధిలోనే స్థానిక ఎన్నికలనూ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఏప్రిల్‌ 6న ఒకే దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈమేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 9న ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్‌ పత్రం ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. జెడ్పీటీసీ సభ్యుడికి గులాబీ రంగు, ఎంపీటీసీ సభ్యుడికి తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తామని చెప్పారు. 22 జిల్లా పరిషత్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *