Tuesday, 3 November 2026

శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

తిరుమల: తిరుమల శ్రీవారి అలయంలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈనెల 16న జరిగే అణివార అస్థానం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమంజనాన్ని నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో, జలాలతో అర్చకులు, అలయ సిబ్బంది అలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో అలయ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు, తితిదే ఈవో ఎంజీ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఈరోజు జరిగే అష్టదళ పాదపద్మారాథన సేవనూ తితిదే రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *