Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

గోరంట్ల: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మాచినతండా వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి రాళ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన బస్సు క్లీనర్‌ నదీమ్‌పాషా (35) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ముందు టైరు పంక్చరై రోడ్డుపక్కన ఉన్న రాళ్లను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *