Tuesday, 3 November 2026

ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని కొండగేరిలో నందన కుర్వఅల్లెన్నను అతని సోదరుడు కుర్వపుల్లన్న వేటకొడవలితో దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ హత్యతో పత్తికొండ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *