Tuesday, 3 November 2026

పెద్ద దర్గాను దర్శించుకున్న తెలుగు సినీ నటుడు కల్యాణ్‌రామ్‌

కపడ: భారతదేశంలో త్రీడి రూపంలో వచ్చిన తొలి యాక్షన్‌ చిత్రం ‘ఓం’ను ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని ఆ చిత్ర కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు. కడప పెద్ద దర్గాను సోమవారం ఆయన దర్శించుకున్నారు. చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సినిమా విజయవంతం కావాలని భగవంతుడ్ని ప్రార్థించడానికి దర్గాకు వచ్చినట్లు కల్యాణ్‌రామ్‌ చెప్పారు. చిత్రాన్ని ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *