Tuesday, 3 November 2026

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలో తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతుంది. దీనికి తోడు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *