గుంటూరు: తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పల్లెల్లో ఎలాంటి పారదర్శక పాలన అందిందో ప్రజలు ప్రత్యక్షంగా చూపించినందునే…. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పటికీ తమ పార్టీ మద్దతు దారులకు పట్టం కట్టారని తెదేపా ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కొన్ని నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ అక్కడ కొన్ని స్థానిక అంశాలు ఎక్కువ ప్రభావం చూపించడం వల్ల కొంత నష్టం జరిగిందన్నారు.




