కర్నూలు: కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. తుంగభద్ర, జూరాల జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,36,610 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,36,900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 873 అడుగులుగా ఉంది. జలాశయం గరిష్ఠస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు.




