కడప, నేరవిభాగం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీ సాయిప్రతాప్ నివాసాన్ని సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస, ఎన్జీవో నాయకులు ఈ ఉదయం ముట్టడించారు. సాయిప్రతాప్ తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ఐకాస కన్వీనర్ రవిశంకర్‌రెడ్డి, ఎన్జీవో నాయకులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




