
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని టీ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని కోరారు. మంత్రులు, ఎంపీలు ఆంటోనీని కలిసి తమ వాదనలు వినిపించారు. 2014 ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారు చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటుకు సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు ఆంటోని కమిటీకి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా చూడాలని కోరారు. తెలంగాణ అత్యధిక సీట్లు కాంగ్రెస్సే గెలుస్తుందని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటు ఏయాలని కోరారు. అంతకుముందు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. ఆంటోనీ కమిటీకి వివరించాల్సిన అంశాలపై చర్చించారు.
తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయండి




