Tuesday, 3 November 2026

తెలంగాణ నోట్‌ రెడీ


మేడం రావడమే ఆలస్యం కేబినెట్‌ ముందుకు
వెనువెంటనే న్యాయశాఖకు : పీటీఐ కథనం
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) :
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేబినేట్‌ నోట్‌ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికా నుంచి రాగానే కేంద్రమంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. సోనియా గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఆదేశాల మేరకు హోంశాఖ కార్యాలయ అధికారులు కేబినేట్‌ నోట్‌ను సిద్ధం చేశారని తెలిపారు. కేబినేట్‌ నోట్‌తో తామంతా సిద్ధంగా ఉన్నామని, సోనియాగాంధీ భారత్‌కు రాగానే రాజకీయ పార్టీల ఆమోదానికి పంపుతామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఆమోదం లభించిన తర్వాత కేబినేట్‌ నోట్‌ను కేంద్ర న్యాయశాఖకు పంపుతామని అధికారులు వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు హోంశాఖ కేబినేట్‌ నోట్‌ను ప్రిపేర్‌ చేస్తోందని, త్వరలోనే మంత్రివర్గం ముందుకు తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రి షిండే ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, సెప్టెంబర్‌ 2న వైౖద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన సోనియాగాంధీ మరో వారం రోజుల్లో భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *