
ఎగతాళి ఎక్కిరింత నుంచే తిరుగుబాటు
తెలంగాణ ఫిలిం ఫెస్టివల్‌లో వక్తలు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి) :
తెలంగాణ అంటేనే ఆంధ్రా సినిమాకు హేళన అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీలోని వివేకానంద ఆడిటోరియంలో నిర్వహిం చిన తెలంగాణ ఫిలిం ఫెస్టివల్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎగతాళి ఎక్కిరింతల నుంచే తిరుగు బాటు మొదలవుతుందని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు సిని మాల్లో అవహేశనకు, అవమానాలకు గురైందని తెలిపారు. తెలంగాణ వనరులను సినిమా పేరుతో దోచుకొని ఇక్కడి ప్రజలను దారుణంగా అవమానించారని తెలిపారు. సినిమా మాధ్యమంలో కోస్తాంధ్ర భాషను హీరోలకు, మంత్రి పాత్ర లకు ఉపయోగిస్తే తెలంగాణ మాండలికాన్ని విలన్లకు, చెడ్డ పాత్రలకు పెట్టి ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు. సినిమా మాధ్యమంగా తెలంగాణపై జరిగిన సాంస్కృతిక దాడి అంతా ఇంతా కాదన్నారు. అన్ని రంగా ల్లోకంటే సినిమా రంగంలో సీమాంధ్రుల ఆధిపత్యం ఎక్కువని, వారి పైత్యమే ఇక్కడ వారసత్వంగా వస్తోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ప్రస్తానాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించే సినిమాలు తీస్తే థియేటర్లు ఇవ్వకుండా నిర్మాతలను దివాళ తీయిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే సినిమాలు తీయాలని పిలుపునిచ్చారు. విప్లవ రచయిత వరవరరావు మాట్లాడుతూ, పాట ఉద్యమాన్ని నడిపిస్తే సకల కళల కలబోతే సినిమా అన్నారు. హిందీ చిత్రాల్లో తెలంగాణ పోరాటా ప్రాశాస్త్యాన్ని కళ్లకు కడితే తెలుగు సినిమా ఎంత మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ కళాకారులకు అవకాశాలు పెంచాలని కోరారు. టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి ఎంతో ప్రతిష్ట తెచ్చిపెట్టిన కళాకారులను అక్కున చేర్చుకుంటామని, మంచి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ నెటిజన్స్ ఫోరం, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం, తెలంగాణ హౌస్ సర్జన్స్, మెడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జయప్రకాశ్, నటేశ్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు వేదకుమార్, మా భూమి నర్సింగరావు మాట్లాడుతూ, తెలంగాణ బతుకు చిత్రాన్ని సినిమాల్లో ప్రతిఫలింపజేయాలని కోరారు. తెలంగాణ నెటిజన్స్ ఫోరం, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం, తెలంగాణ హౌస్ సర్జన్స్, మెడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిల్మ్ మేకర్ చక్రపాణి, జర్నలిస్టు సి. వనజ, జయప్రకాశ్, నటేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అంటేనే ఆంధ్రా సిన్మాకు హేళన




