
– కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పడే సమయం ఆసన్నమైందని, ఈ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులపై విజయంగా భావించడం సరికాదన్నారు. 57 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ తీవ్రమైన వెనుకబాటుతనం ఉందని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే.. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలకు పరిపాలన సౌలభ్యం, ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయన్నారు. 2014 ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపడుతారని, ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాధించుకునే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి




