
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) :
నిరుపేదలకు పట్టెడన్నం పె డితే డబ్బులు వృథా అని భావించడం సరికాదని కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని పునరావాస కాలనీలకు చెందిన నివాసుల తొలి బృందానికి యాజమాన్య హక్కులను కల్పించే పత్రాలను అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో గత వారం ఆమోదించిన ఆహార భద్రత బిల్లు విమర్శకులను ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. పేదల ఆహారం కోసం ఖర్చు చేసే ధనం ఆర్థిక వనరుల వృథాగా పరిగణించకూడదని వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి చారిత్రాత్మక చట్టాలను తీసుకువచ్చిన యూపీఏ ప్రభుత్వం దేశంలోని పేదల ఆకలిని శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. పేదలకు ఆహారం అందిస్తే డబ్బు వృథా అంటారా..? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. దేశంలోని పేదలు ఎవరిపై ఆధారపడకుండా వారి కాళ్లమీద వారే నిలబడాలన్నదే మా ఆకాంక్ష అన్నారు.
పేదలకు పట్టెడన్నం పెట్టడమే తప్పా – రాహుల్ గాంధీ




