
ఫలించిన రష్యా దౌత్యం
రసాయన ఆయుధాల అప్పగింతకు సిరియా సుముఖం
న్యూయార్క్, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) :
సిరియాపై దాడి విషయంలో అమెరికా వెనకడుగు వేసింది. రసాయన ఆయుధాలు అప్పగిస్తే దాడులు చేయమంటూ స్పష్టం చేసింది. రసాయనిక ఆయుధాల అప్పగింతకు తాము సిద్ధమేనని సిరియా అంగీకరించింది. రసాయన ఆయుధాల నిర్వీర్య బాధ్యతను రష్యా స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ విషయమై అమెరికా-రష్యాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. సిరియాపై ఏకపక్షంగా దాడులకు పాల్పడాలన్న ఆలోచనను భారత్ వ్యతిరేకించిన విషయం విదితమే. సిరియాపై చేపట్టే ఎలాంటి చర్యలైనా ఐక్య రాజ్యసమితి నిర్ణయానికి లోబడే ఉండాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సిరియాలో రసాయనిక ఆయుధాల వినియోగంపై ఐక్య రాజ్యసమితి దర్యాప్తు పూర్తి నివేదిక వెలువడేంత వరకు వేచి ఉండాలని జీ-20 నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐక్య రాజ్యసమితి నిర్ణయంతో సంబంధం లేకుండా.. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించగానే సిరియాపై సైనిక దాడి చేపట్టేందుకు అమోరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా వెనక్కి తగ్గడం శుభపరిణామంగా భావించవచ్చు.
సిరియాపై దాడికి వెనక్కి తగ్గిన అమెరికా




