
తెలంగాణ బిల్లు కోసం నినదించిన టీ అడ్వకేట్ జేఏసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనంసాక్షి) :
హైకోర్టు ఆవరణలో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. జై తె లంగాణ నినాదాలతో ¬ రెత్తింది. తెలంగాణ న్యా యవాదులు తలపెట్టిన ‘చలో హైకోర్టు’ను పోలీసు లు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీ సులు పలువురు తెలంగా ణ న్యాయవాదులను అరె స్టు చేసి, అక్కడి నుంచి త రలించారు. కోర్టు పరిస రాల్లో ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ముందస్తు జాగ్రత్తగా సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించారు. అయితే, ఇటీవల సీమాంధ్ర న్యాయవాదులు చేసిన దాడులను నిరసిస్తూ విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు బుధవారం ‘చలో హైకోర్టు’కు పిలుపునిచ్చారు. సీమాంధ్ర లాయర్ల ఆగడాలకు నిరసనగానే చలో హైకోర్టుకు పిలుపునిచ్చామని టీ న్యాయవాదుల జేఏసీ నేత శ్రీరంగారావు తెలిపారు. సీఎం కిరణ్, డీజీపీ అండదండలతోనే సీమాంధ్ర లాయర్లు రెచ్చిపోతున్నారని, దీన్ని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో హైకోర్టుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపుతో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు కోర్టుకు తరలివచ్చారు. మరోవైపు, విభజనను నిరసిస్తూ సీమాంధ్ర న్యాయవాదులు హైకోర్టు ఆవరణలో నిరసనలు చేపట్టారు. ఓవైపు తెలంగాణ న్యాయవాదుల ర్యాలీ, మరోవైపు, సీమాంధ్రుల మానవహారం నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే భారీగా బలగాలను మోహరించారు. నిరసన కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. 6, 7 గేట్లకు తాళాలు వేశారు. అడిషనల్ కమిషనర్ అంజన్‌కుమార్ స్వయంగా వచ్చి పరిస్థితిని సవిూక్షించారు. నిరసనలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తప్పనిసరి అని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మైకుల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రెస్విూట్లకూ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు చేపడితే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మదీనా సెంటర్ నుంచి సిటీ కాలేజీ రోడ్డు వరకూ ఇరువైపులా ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహించేందుకు వచ్చిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పోలీసుల హెచ్చరికలతో సీమాంధ్ర లాయర్లు ఆందోళన విరమించారు.
హైకోర్టు ఆవరణలో ఉద్రిక్తత




