Tuesday, 3 November 2026

హైదరాబాద్‌పై షరతులొప్పుకోం తెలంగాణకే రాజధాని


తాత్కాలిక ఉమ్మడికైతే ఓకే
29న సకల జనభేరీ : కోదండరామ్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి) :
హైదరాబాద్‌పై ఎలాంటి షరతులను ఒప్పుకోబోమని టీ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఈనెల 29న హైదరాబాద్‌లో ‘సకలజన భేరి’ పేరిట నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస తీర్మానించింది. గతంలో స్వాభిమాన్‌ సదస్సు పేరును సూచించినా ఇప్పుడు దానిని సలజనుల భేరీగా మార్చారు. త్వరగా తెలంగాణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయించారు. శనివారం నగరంలోని నాచారం నోమా ఫంక్షన్‌ హాల్లో తెలంగాణ ఐకాస విస్తృస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టి.ఐకాస పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనే పదాన్ని బిల్లులో వాడరాదని అన్నారు. ‘సకల జనభేరీ’ సదస్సుకు 10 జిల్లాల్లో సన్నాహక రణభేరీ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సు ఏర్పాటుకు నిజాం కళాశాల మైదానం లేదా ఇతర అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం అమలులో తాత్సారం చేయడమే నేటి పరిస్థితికి కారణమని అన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకుల వైఫల్యం వల్లే తీర్మానికి జాప్యమవుతోందని విమర్శించారు. నేటి పరిస్థితిని ప్రజలకు తెలపాలని ఐకాస నిర్ణయించిందని, అందరం సంఘటితంగా పోరాడితే తెలంగాణ ఏర్పాటు తథ్యమని కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేసారు. హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకుల వైఫల్యం వల్లే తీర్మానికి జాప్యమవుతోందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *