కృత్రిమ సమైక్య ఉద్యమానికి కిరణే నాయకుడు
సకలజన భేరీకి భారీగా తరలిరండి : కోదండరామ్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) :
సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వం వహిస్తు న్నారని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాం ఆరోపించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉస్మానియా యూ నివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట టీఎస్‌జేఏసీ ఆధ్వ ర్యంలో తెలంగాణ పరి రక్షణ సభ జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడే సమస్యలు పరిష్కరించి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు. 1969లోనే రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకు ఇప్పటి వరకు కొనసాగుతున్న ఉద్యమమే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌తో కూడి న పది జిల్లాల తెలంగాణ తప్ప ఎలాంటి ప్రత్యామ్నా యానికి అంగీకరించేది లేదన్నారు. ఒక జిల్లాను కలుపుతామన్నా, తీసి వేస్తామన్నా ఒప్పుకోమని చెప్పారు. హైదరాబాద్‌పై పెత్తనం చేస్తే ఊరుకోబో మని హెచ్చరించారు. కేంద్ర కేబినెట్ నోట్ తయా రీలో ఆలస్యం కావడం వల్లే సీమాంధ్రుల నుంచి రకరకాల డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులంతా మరోసారి ఉద్యమం వైపు నడువాలని కోరారు. కొంతమంది పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు గుప్పెడు మంది అక్రమ ఉద్యోగులు హైదరాబాద్‌పై నానా రకాలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌పై మాట్లాడే నైతిక హక్కు సీమాంధ్రులకు లేదన్నారు. కేంద్రం కేబినెట్ నోట్, ప్రత్యేక బిల్లు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 29న జరిగే సకలజన భేరిని విజయవంతం చేయాలని, ఇందుకు కాంగ్రెస్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రసమయి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.