Wednesday, 4 November 2026

ఘనంగా గణనాథుని నిమజ్జనం


భారీగా లంబో’ధర’ లడ్డూ
బాలాపూర్‌ లడ్డూ ‘తీగల’ వశం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) :
భక్తుల పూజలందుకున్న గణనాథుడు నిమజ్జ నానికి తరలాడు. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ శోభాయాత్ర సందడి సందడ ిగా సాగింది. హైదరాబాద్‌లో మాత్రం నిమజ్జ నోత్సవం కొనసాగుతోంది. చిన్నాపెద్ద సైతం ప్రతీకలతో ఊరేగింపుగా నిమజ్జన ప్రదేశాలకు చేరుకుంటున్నారు. పోలీసు పహారాలో ప్రశాంతంగా నిమజ్జనోత్సవం జరుగుతోంది. బాలాపూర్‌ గణేశుడు బుధవారం సాయంత్రం నిమజ్జనానికి తరలాడు. ఖైరతాబాద్‌ గోనాగ చతుర్ముఖుడు అర్ధరాత్రి శోభాయాత్రగా బయ ల్దేరాడు. సుమారుగా 60వేల గణేష్‌ ప్రతిమలు గంగఒడిలోకి చేరుకున్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఉదయం 6 గంటల నుండే నిమజ్జనం ప్రారంభం
– హుస్సేన్‌సాగర్‌కు ఉదయానికే చేరుకున్న వినాయక ప్రతీకలు
– బాలాపూర్‌లో పోలీసులకు విహెచ్‌పి కార్యకర్తల మధ్య వాగ్వాదం
– ట్యాంక్‌బండ్‌పై 23 క్రేన్లు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ భారీగా క్రేన్లు
– జంటనగరాల్లోని 24 చెరువుల్లో నిమజ్జనోత్సవం. అన్నిచోట్ల గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచారు.
– ఖైరతాబాద్‌ వినాయకుని ప్రతీక ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం
– బాలాపూర్‌లోని వినాయకుని లడ్డూప్రసాదం వేలం 9.30 గంటలకు ఆరంభమైంది. గతేడాది రూ.7.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే. 1994 నుంచి
లడ్డూప్రసాదం వేలం కొనసాగుతోంది. తొలుత రూ.450తో ప్రారంభమైంది. ఈ ఏడాది రూ.9.26 లక్షలకు టికేఆర్‌ విద్యాసంస్థల అధిపతి, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. లడ్డూప్రసాదం బరువు 21 కిలోలు. అనంతరం స్వామివారి శోభాయాత్ర ఆరంభమైంది. రాత్రి 8 గంటల సమయానికి హుస్సేన్‌సాగర్‌కు చేరుకునే అవకాశం ఉంది.
– జంటనగరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నదని నగర సిపి అనురాత్‌ శర్మ తెలిపారు.
– 23వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
– నగరం నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్న గణనాథుల ప్రతీకలు.
– జంటనగరాల్లో సిసి కెమెరాలు, వీడియో కెమెరాలతో నిఘా కొనసాగింపు.
– మొజంజాహి మార్కెట్‌ వద్ద మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేశారు.
– చార్మినార్‌ వద్ద భారీ భద్రతను కల్పించారు. పోలీస్‌ పికెటింగ్‌ కొనసాగుతోంది.
– దిల్‌సుఖ్‌నగర్‌వైపు నుంచి వచ్చే బస్సులను ఉదయం 10 గంటల వరకు గాంధీభవన్‌ మీదుగా అనుమతి ఇచ్చారు.
– ట్యాంక్‌బండ్‌కు భారీగా తరలివస్తున్న భక్తులు.
– కోఠి, నిజాంకళాశాల, లిబర్టీ, బేగంబజార్‌, ఉస్మాన్‌గంజ్‌ వద్ద పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు భక్తులు పులిహోర పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ అందిస్తున్నారు.
– మక్కామసీదులో ప్రార్థన సమయం కావడంతో చార్మినార్‌ వద్ద ఆలయాల వద్ద మైకులను కొద్దిసేపు పోలీసులు ఆపివేశారు. మైకుల నిలిపివేతపై విహెచ్‌పి కార్యకర్తలు కొందరు నిరసన తెలిపారు.
– హుస్సేన్‌సాగర్‌తో కాప్రా, సరూర్‌నగర్‌, మీరాలం ట్యాంకు, రాజన్నబావి, ఎర్రగుంట, దుర్గం, పాపిరెడ్డి, నల్ల, గంగారం, హఫీజ్‌ పేట, పటాన్‌చెర్వు, ఐడిఎల్‌ ట్యాంకు, సున్నం, హస్మత్‌పేట, ప్రగతినగర్‌, సురారం, వెన్నెలగడ్డ, చిన్నరాయుని, పెద్దరాయుని, అస్మన్‌ట్యాంక్‌, సఫిల్‌గూడ చెరువులలో నిమజ్జనోత్సవం సాగుతోంది.
– సరూర్‌నగర్‌ చెరువు వద్ద ప్రశాంతంగా సాగుతోంది. చాదర్‌ఘాట్‌, డబీర్‌పురా, యాకుత్‌పురా, మలక్‌పేట, కొత్తపేట, ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, బిఎన్‌రెడ్డి నగర్‌, చంపాపేట, మాదన్నపేట, సంతోష్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి వినాయక ప్రతీకలు ఊరేగింపుగా తరలి వస్తన్నాయి. చెరువు వద్ద భారీ భద్రత కల్పించారు. ఏడు క్రేన్ల సహాయంతో నిమజ్జనోత్సవం సాగుతోంది.
– కూకట్‌పల్లి ప్రగతినగర్‌ చెరువులో ప్రశాంతంగా సాగుతోంది. చందానగర్‌, వసంతనగర్‌, నిజాంపేట రోడ్డు, కెపిహెచ్‌బి, కూకట్‌పల్లి, మియాపూర్‌, తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన గణేశ్‌ ప్రతీకలకు నిమజ్జనోత్సవం సాగుతోంది. బుధవారం వెయ్యి ప్రతీకలకు నిమజ్జనం జరగనున్నదని అంచనా వేస్తున్నారు.
– బడంగ్‌పేట లడ్డూప్రసాదం రూ.6.40 లక్షలు పలికింది.
– చిన్న ప్రతీకలు ట్యాంక్‌బండ్‌వైపు, భారీ ప్రతీకలు ఎన్టీఆర్‌ మార్గ్‌వైపు కదులుతున్నాయి.
– అల్మాస్‌గూడలో లడ్డూప్రసాదం రూ.1.11 లక్షలు పలికింది.
– నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జనోత్సవం.. ఒకటో నంబరు గణపతి ప్రతీక వద్ద ఎంపి గుత్తా సుకేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ చిరంజీవులు, ఎస్‌పి ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనోత్సవం సాగుతోంది. బుధవారం మధ్యాహ్ననికి 50శాతం ప్రతీకలకు నిమజ్జనం జరిగింది.
ఊరేగింపు ఇలా..
కేశవగిరి, నాగుల్‌చింత, ఫలక్‌నుమా, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌ గంజ్‌, ఎంజె మార్కెట్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు ఊరేగింపు కొనసాగుతోంది. అలాగే సికింద్రాబాద్‌ వైపు నుండి.. రాష్ట్రపతి రోడ్డు, కర్బాలా మైదాన్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ వద్ద ఊరేగింపులో కలుస్తోంది. అదేవిధంగా ఈస్ట్‌జోన్‌ నుంచి.. ఉప్పల్‌, రామంతాపూర్‌, అంబర్‌పేట,ఓయు ఎన్‌సిసి, డీడీ ఆసుపత్రి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తోంది.  వెస్ట్‌ జోన్‌ వైపు నుంచి.. ఎంజె మార్కెట్‌ మీదుగా సచివాలయం వద్ద ఊరేగింపులో కలుస్తోంది.
బుధవారం మధ్యాహ్నం నుంచి..
కరీంనగర్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల బస్సులు బుధవారం ఉదయం నుండి జూబ్లీ బస్సుస్టేషన్‌,పికెట్‌ వరకు బుధవారం మధ్యాహ్నం నుంచి  పరిమితం. మహబూబ్‌నగర్‌, రాయచూర్‌, కర్నూలు వెళ్లే బస్సులు ఎంజిబిఎస్‌ నుంచి సాగర్‌రింగురోడ్డు మీదుగా నడుస్తున్నాయి. అదేవిధంగా సూర్యాపేట, నార్కట్‌పల్లి, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు ఎంజిబిఎస్‌ నుండి నడుస్తున్నాయి. జహీరాబాద్‌ నుండి వచ్చే బస్సులు బోయినపల్లి మీదుగా జెబిఎస్‌కు చేరుకుంటున్నాయి. వరంగల్‌ బస్సులు ఎంజిబిఎస్‌ నుండి ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు మీదుగా నడుస్తున్నాయి. శ్రీశైలం, దేవరకొండ వైపు వెళ్లే బస్సులు ఎంజిబిఎస్‌ నుండి సాగర్‌ రింగు రోడ్డు మీదుగా నడుస్తాయి. బిహెచ్‌ఇఎల్‌, జీడిమెట్ల, కెపిహెచ్‌బి వైపు వెళ్లే బస్సులు బాలానగర్‌, బోయినపల్లి, మెట్టుగూడ, తారనాక, నాగోల్‌, ఎల్బీనగర్‌ మీదుగా నడుస్తున్నాయి. 18వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 19వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటిఎస్‌ రైళ్లను నడుపుతోంది.
జంటనగరాల్లో..
– చార్మినార్‌ వైపు వెళ్లే బస్సులను అఫ్జల్‌గంజ్‌ వరకే పరిమితం
– కూకట్‌పల్లి, మియాపూర్‌, బిహెచ్‌ఇఎల్‌ నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్‌ వరకే పరిమితం
– మెహదీపట్నం, గచ్చిబౌలి నుండి వచ్చే బస్సులు లక్డీకాపూల్‌ వరకే పరిమితం
– దిల్‌సుక్‌నగర్‌, హయత్‌నగర్‌, మిధాని, నాంపల్లి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కోఠి ఉమెన్స్‌ కళాశాల బస్టాపు వరకు పరిమితం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *