Wednesday, 4 November 2026

కొత్త కోటలో దారుణం


మహిళపై పోలీసుల కీచకపర్వం
మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి): కొత్తకోటలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి  బస్సు కోసం వేచి ఉన్న మహిళపై ఒక హోంగార్డు, మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి బంధువులు సైతం పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *