
ఆడవాళ్లను మా దగ్గరకు పంపడమేంది
అధిష్టానం విస్మయం
మంత్రులకు భార్యలైతే.. ప్రజలకు నేతలవుతారా?
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 (జనంసాక్షి) :
సీమాంధ్ర మంత్రులు, నేతలు ఆడవాళ్లతో రాయబేరాలు నడపడంపై కాంగ్రెస్ అధిష్టానం విస్మయం వ్యక్తం చేసింది. ఆడవాళ్లను అధిష్టానం పెద్దలకు పంపడమేమినటని నివ్వెరబోయింది. మంత్రులకు భార్యలైతే మాత్రం ప్రజలకు నేతలవుతారా అని పలువురు అధిష్టానం పెద్దలు వారినే నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించకపోవడమే కాకుండా సీమాంధ్ర మంత్రుల వ్యవహారంపై తెలంగాణవాదులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సీమాంధ్ర మంత్రుల వ్యవహారశైలిపై అధిష్టానం కూడా అవాక్కయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలోని వనరులు, ఉద్యోగాలు, ఆదాయం, నీరు వంటి సీమాంధ్రులు దోచుకుంటున్నారని, అందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నామంటూ వ్యాఖ్యలు చేస్తుండగా.. సీమాంధ్ర మంత్రులు తమ సతీమణులను అధిష్టానం వద్దకు దూతలుగా పంపే స్థితికి దిగజారడం దురదృష్టకరమనే వ్యాఖ్యానాలు కూడా వినవస్తున్నాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మంత్రులవుతారు. వారు రాష్ట్ర సమస్యలపై స్పందించే అవకాశం ఉంటుంది. కానీ, మంత్రుల భార్యలకు ఏం అవగాహనం ఉంటుందని, ఏ అధికారం ఉంటుందని, అధిష్టానం వద్దకు దూతలుగా పంపారో తమకు అర్థం కావడం లేదనే వాదనలు జోరుగా సాగుతున్నాయి. మంత్రుల భార్యలుగా సమాజంలో వారికి గౌరవం ఉండొచ్చు. కానీ ఒక రాజ్యాంగప్రక్రియను ఆపాలంటూ అధిష్టానం వద్దకు ఏ హోదాలో పంపారో సీమాంధ్రుల మంత్రులకే తెలియాలంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వారిలో అన్నివర్గాల ప్రజలు ఉన్నారు. ఉద్యమకారులు ఉన్నారు. అందులో సత్యవాణి వంటి ప్రజల్లో తెలిసిన మహిళా ఉద్యమకారులు ఉన్నారు. వారిని పంపినా ఉద్యమభాగస్వాములనే విషయం తెలుస్తుందని కానీ, సీమాంధ్ర మంత్రులు ఏకంగా తమ భార్యలనే అధిష్టానం వద్దకు పంపడంపై సీమాంధ్ర సైతం పెదవి విరుస్తున్నారు. గతంలో వద్దకు కూడా వారు వెళ్లారు. అప్పుడు కూడా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం కానరాకపోవడంతో చివరకు ఏకంగా ఢిల్లీకే సతీమణులను పంపడం మాత్రం సర్వత్రా పలురకాలైన చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఏమిటీ రాయబేరం




