Tuesday, 3 November 2026

లౌకికతత్వం, సర్వతోముఖాభివృద్ధే దేశ పునాదులు


యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ
పచ్‌పదరా, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) :
దేశంలో లౌకికతత్వం, సర్వతో ముఖాభివృద్ధి చెట్టాపట్టాలేసు కుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ అధి నేత్రి సోనియాగాంధీ అన్నారు. రాజస్థాన్‌లోని పచ్‌పదరాలో రూ.37,230 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రిఫైనరీ, పెట్రో కాంప్లెక్స్‌కు ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పేదలు, గిరిజనులు, మహి ళల సాధికారిత, అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్నారు. పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌తో రాజస్థాన్‌కు ఆర్థికంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అశోక్‌గెహ్లాట్‌ సర్కారు ఆ ధనాన్ని పేదలు, ప్రజోపయోప పథకాలకు ఖర్చు చేస్తుందని తెలిపారు. బర్మేర్‌ ప్రాంతం కొద్దికాలంలో అభివృద్ధిపథంలోకి దూసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చమురు రిఫైనరీ కోసం ముడి చమురును వెలికితీసి వినియోగించడంలో రాజస్థాన్‌ దేశంలోనే మొదటి రాష్ట్రమవుతుందని తెలిపారు. దీంతో 25 వేల ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, స్వయం సహాయక సంఘాలు, ఆహార భద్రత బిల్లు, భూసేకరణ బిల్లు మొదలైన వాటిపై వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ, ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *