పేదలు, దళితుల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం నల్లగొండ జిల్లా గ్రామాల్లో సరికొత్త వెలుగులు నింపుతోంది. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో దళిత పేద కుటుంబాలు ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్నాయి. అర్ధికంగా స్వావలంబన సాధిస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పేదలకు మూడెకరాల భూపంపణీ విజయవంతంగా అమలు చేస్తున్నారు ఇప్పటి వరకు జిల్లాలో 550 మంది లబ్దిదారులను అధికారులు గుర్తించారు. మెదటి విడతగా 12 నియోజకవర్గాలలోని 13 గ్రామాలలో 262మంది దళిత కుటుంబాలకు 693 ఎకరాల భూమిని పంచారు. ఆయా కుటుంబాల ఆడబిడ్డల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాల్ని అందించారు. దీంతో పాటు మెదటి విడత సాగుకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తూ డబ్బుల్ని మంజూరు చేసింది. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని చోట ప్రైవేటు వ్యక్తుల నుండి వ్యవసాయ యోగ్యమైన భూములను ప్రభుత్వం అందించిన నిధులతో కొని దళితులకు పంపిణీ చేశారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం గోపాలపురం గ్రామంలో సీఎం కేసీఆర్ చేపట్టిన భూ పంపిణీ దళిత జీవితాల్లో వెలుగులు నింపింది. గ్రామంలో మెత్తం 21 మంది లబ్దిదారులకు 63 ఎకరాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం 8 కుటుంబాలు 24 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నరు. అందుకు గాను ప్రభుత్వం వీరికి పెట్టుబడి కోసం ఎకరాకు 15 వేల రూపాయల్ని అందించింది. కొన్ని చోట్ల బోర్లు వేయాలని రైతులు కోరగా ఇందిర జలఫ్రభ పథకం క్రింద రెండు బోర్లను వేసారు. కరెంటు సదుపాయం కల్పించి ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నరు. వీరందరికి ప్రభుత్వ గుర్తింపు కార్డులను కూడా జారీ చేశారు. పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందెందుకు బార్ కోడింగ్ కార్డుల్ని కూడా ఇచ్చారు.
మోడువారిన తమ జీవీతాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని దళితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చిన మూడెకరాల స్దలంలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ చేయుతతో ఆత్మస్దైర్యంతో బ్రతుకుతున్నామని.. ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు.
ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ పథకం పేద దళితుల జీవితాల్లో ఆనందం నింపుతోంది. సీఎం కేసీఆర్ అందించిన చేయూతతో ఆర్ధింకగా నిలదొక్కుకుంటామని దళిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.




