
ఆదేం ఆర్డినెన్స్.. నాన్సెన్స్
చించి పారేయాలి
ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. నేర చరితులను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఆ ఆర్డినెన్స్ పూర్తి నాన్సెన్స్.. దాన్ని చించిపారేయాలి’ అని వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతిని రూపుమాపాలంటే ఇలాంటి విషయాల్లో రాజీ పడడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. నేరచరితులపైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడకుండా ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ అర్థరహితమని కుండబద్దలు కొట్టారు.యూపీఏ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును తోసిరాజని, కోర్టు విపక్షాల ఆందోళనలను, ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా.. నేర చరితులను కాపాడేందుకు హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకురావడంపై సొంత పార్టీలోనే నిరసన వ్యక్తమైంది. రెండేళ్లకు మించి శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. అయితే, దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై తక్షణమే అనర్హత వేటు పడకుండా వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. కీలకమైన వ్యక్తే ఆర్డినెన్స్‌ను తప్పుబట్టడంతో పరాభావ భారంతో పునరాలోచనలో పడింది. ఆర్డినెన్స్ తీసుకురావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకే వెళ్లింది. కానీ, రాహుల్ వంటి వారి నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంపై యూపీఏ జీర్ణించుకోలేక పోతోంది.ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ విూట్ ది ప్రెస్‌కు హఠాత్తుగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చిన రాహుల్.. ఆర్డినెన్స్‌పై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి ప్రభుత్వ పెద్దలకూ షాక్ ఇచ్చారు. ఆర్డినెన్స్‌పై ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయమని తేల్చి చెప్పారు. ‘ఇట్స్ కంప్లీట్ నాన్సెన్స్’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ సహా రాజకీయ పార్టీలన్నీ ఈ ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాజీపడే పద్ధతులు మార్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఆర్డినెన్స్ తేవాలన్న ప్రభుత్వ ఆలోచన నిర్ణయం సరికాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. అవినీతిని నిజంగా అరికట్టాలనుకుంటే ఇలాంటి అర్ధరహిత ఆర్డినెన్స్‌లు తేకూడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందోనన్నది ముఖ్యం కాదని.. ఆర్డినెన్స్ నిర్ణయం మాత్రం తప్పని తెలిపారు. ఆయన వెళ్లిన అనంతరం పార్టీ అధికార ప్రతినిధి అజయ్‌మాకెన్ మాట్లాడుతూ.. రాహుల్ చెప్పిందే తమ పార్టీ అభిప్రాయమన్నారు.
స్వపక్షంలో విపక్షం.. నేరస్తుల్ని రక్షిస్తారా




