Tuesday, 3 November 2026

పోయేకాలం.. నేను సమైక్యాంధ్ర సీఎంనే


దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పినప్పుడల్లా మరింతగా పనిచేయాలనిపించింది
సమైక్యాంధ్ర కోసం సీఎం సీటునైనా వదులుకుంటా
-కిరణ్‌కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) :
నేను సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రినేనని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మీడి యాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజ య్‌సింగ్‌ చెప్పినప్పుడల్లా సమైక్యాంధ్ర కోసం మరింతగా పనిచే యాలనిపిస్తోందని తెలిపారు. నెహ్రూ, పటేల్‌ బలమైన బంధం వేశారని, దానిని ఇందిరాగాంధీ గట్టిగా ముడి వేశారని అన్నారు. ఇంత టి బలమైన చిక్కుముడిని విడదీయడంసాధ్యం కాదని అన్నారు. సిడబ్ల్యూ సి నిర్ణయం శిలాశాసనం అంటున్న వారు నెహ్రూ, ఇందిరాగాంధీల నిర్ణయాలకు సమాధానం చెప్పాలన్నారు. విభజనకు అనేక చిక్కుముళ్లు ఉన్నాయన్నారు.  అలాగే తాను సోనియా భిక్ష వల్ల, కాంగ్రెస్‌ వల్లనే సిఎంను అయ్యానని అన్నారు. తాను సిఎంగా భవిష్యత్‌ తరాలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు సిఎం పదవి ముఖ్యం కాదన్నారు. తనకు రాబోయే తరాలు, ప్రజల భవిష్యత్‌ ముఖ్యన్నారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే సీఎం పదవినైనా వదులుకుంటానని చెప్పారు. అందుకే తాను విభజనపై అభ్యంతరం చెప్పుతున్నానని అన్నారు. అలాగే ఇప్పుడు జరిగింది రాజీయ నిర్ణయమే పత్ప ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు. దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పినట్లుగా ఇది పరిష్కారం కాదన్నారు. ఆయన మాకు శాశ్వతమైన కార్యదర్శి కాదన్నారు. రాజకీయంగా ఎన్నైనా చెప్పవచ్చన్నారు. కానీ కేంద్రం ఏ విధంగా హావిూ ఇస్తుందో చెప్పాలన్నారు. కేందప్రభుత్వం, సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారని, సీమాంధ్ర ఉద్యమంలో ఆరున్నర లక్షల మంది పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమకారులు సమ్మె విరమించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  సుమారు ఆరు లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున  స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడి ఉన్నాయని అన్నారు. స్కూళ్లు బంద్‌ కావడంతో విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. అందుకే ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వం తరపున తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కేవలం జీతాలపైనే ఆధారపడే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విూరు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది’ అని సీఎం సీమాంధ్ర ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు.సమైక్యాంధ్ర సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని, ఉద్యమాన్ని విరమించుకుని విధుల్లో చేరాలని కోరారు. టీచర్లు, ఉద్యోగులు, కార్మికులు సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సులు నడవక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆర్టీసీ కార్మికులు విధులో చేరాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి రంగంలో తీవ్ర నష్టం జరుగుతుందని సీఎం కిరణ్‌ సెలవిచ్చారు. కృష్ణా నదిలో మనకు కేటాయించిన నీరు 11 టీఎంసీలు అయితే, వరద నీటితో కలిసి మనం 1150 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మించుకున్నామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభంలోనే నీరు విడుదల చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఫజలీ కమిషన్‌ చెప్పిందని అన్నారు.కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్‌ వల్ల నల్లగొండ, గుంటూరులో 70 వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయని చెప్పారు. పులిచింతల వల్ల గుంటూరులో 14 వేల ఎకరాలు, నల్లగొండలో 13 వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయన్నారు. రాష్ట్రం అప్పుడే విడిపోయి ఉంటే 70 వేల ఎకరాలు ముంపుకు గురయ్యేవా? అని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎనిమిది జిల్లాల్లో 74 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే 40.33 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండలో 13.55 లక్షల ఎకరాలు, నెల్లూరు, ప్రకాశంలో 4.22 లక్షల ఎకరాలు సాగుచేయవచ్చని తెలిపారు. రాయలసీమలో 22.56 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు.  శ్రీశైలంప్రాజెక్టులో మనకు 99.7 టీఎంసీల నీటిని కేటాయించారని అన్నారు. కానీ మనం వాడుకుంటున్నది 25 టీఎంసీలేనని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎనిమిది జిల్లాల్లో 74 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే 40.33 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండలో 13.55 లక్షల ఎకరాలు, నెల్లూరు, ప్రకాశంలో 4.22 లక్షల ఎకరాలు సాగుచేయవచ్చని తెలిపారు. రాయలసీమలో 22.56 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు. కర్ణాటకలో అల్మట్టీ డ్యాం ఎత్తును పెంచడం వలన మనకు వచ్చే నీరు తగ్గుతుందని తెలిపారు.పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 307 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని సీఎం అన్నారు. ఎనబైఏడు టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించొచ్చని అన్నారు. 45 టీఎంసీలు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు వాడుకునే అవకాశం ఉందని అన్నారు. పోలవరం పూర్తయితే దుమ్ముగూడెం, పులిచింతలకు నీరు అందుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *