తెలంగాణపై మాటమీద నిలబడండి
హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల రాష్ట్రం ఇవ్వండి
శీతాకాల సమావేశాల్లో బిల్లు తెస్తే పూర్తి మద్దతు : సుష్మా
వేయిమంది కిరణ్‌లు వచ్చిన తెలంగాణను అడ్డుకోలేరు
బరిగీసి పోరాడుదాం.. ఆత్మబలిదానాలొద్దు : కోదండరామ్
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28 (జనంసాక్షి) :
కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గకుండా మాటమీద నిలబడాలని పార్లమెంట్లో ప్రతిపక్షనేత సుస్మాశ్వరాజ్ కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా పాల మూరులో ‘తెలంగాణ ప్రజా గర్జన’ సభ జరిగింది. ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసం గించారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఇవ్వాలని కోరారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లుపెట్టి ఆమోదింపజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మాణం తర్వాత రాష్టాన్న్రి అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. పాలమూర్ జిల్లా అభివృద్దికి సంబందించిన ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉన్న పాలమూర్ ఎత్తిపోతల పథకాన్ని తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే జాతీయ ప్రాజెక్టుగా చేపడుతామని, అలాగే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి ఇరు ప్రాంతాలకు నీటి సమస్యను లేకుండా చూస్తామన్నారు. తెలంగాణపై బిజెపి ఏనాడు కూడా కనీసం కలలో కూడా వెనక్కి పోదన్నారు. కొన్నిపత్రికలు ఇటీవల బిజెపి యూటర్న్ తీసుకుందని, టిడిపితో పొత్తు కుదుర్చుకుందని అవాస్తవమైన వార్తలు రాస్తూ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విరుచుకు పడ్డారు. ఏఒక్కరు కూడా కలలో ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఏపార్టీతో పొత్తులు కుదరలేదని, ఆసమయం ఇంకా రానే లేదన్నారు. అయినా పొత్తు పెట్టుకున్నా కూడా తెలంగాణ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతకూడా ఇరు ప్రాంతాలవారు కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కొందరుహైద రాబాద్‌లో కొందరు తెలంగాణ వచ్చాక సీమాంధ్రులు వెళ్లిపోవాల్సిందేనని బెదిరింపు దోరణులకు పాల్పడ్డ ట్లుగా వార్తలు చూశానన్నారు. విజయం తర్వాత వినయం అవసరమన్నారు. వాస్తవంగానే ఓటమి చెందిన వారు ధిక్కార దోరణిలోనే ఉంటారని వారిని కలుపుకుని మన పని మనం కానిచ్చుకోవాలన్నారు. తాము మూడు రాష్టాల్రు ఇచ్చినప్పుడు కనీసం చుక్కకూడా రక్తం చిందకుండా పూర్తిచేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అనైతికంగా వ్యవహరించడం వల్ల, రాజకీయ కాంక్షతో చర్యలు చేపట్టడం వల్లే నేడు సమస్య ఉత్పన్నం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జూలై 30వతేదీన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని నేటికి రెండు నెలలు పూర్తి అవుతున్నా కూడా ఇంచు కూడా ముందుకు కదలకపోవడం దుర్మార్గమన్నారు. రాష్టాల్ర విభజన కార్యక్రమానికి నిర్ణీత కార్యక్రమం ఇప్పటికే ఉండనే ఉందన్నారు. దాని ప్రకారం చర్యలు తీసుకోకుండా కేవలం రాజకీయంగా లబ్దిపొందేందుకు నిర్ణయం చేయడంవల్ల సమస్య ఉత్పన్నం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర నేతలు వ్యతిరేకించడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులపై ఏపాటి అజమాయిషీ ఉందో అర్థం అవుతుందన్నారు. గతంలోలాగే వెనక్కి తగ్గితే మాత్రం కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించడం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమం గత ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్నదని, ఇందులో నైతికత, వాస్తవికత చాలా ఉంద న్నారు.ఇటీవల పార్టీ తీసుకున్న నిర్ణయాలే ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు దోషులను రాజకీయాల్లో కొనసాగించకూడదనే చట్టాన్ని తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ ఇటీవలే అందుకు భిన్నంగాఆర్డినెన్స్తీసు కువచ్చి మోసంచేసిందన్నారు. ఆనాడే తాముఆభ్యంతరం వ్యక్తం చేశామని పెడచెవిన పెట్టిన కేంద్రం నేడు రాహుల్‌గాందీ చెప్పగానే వెనక్కి తగ్గేందుకు సుముఖత వ్యక్తం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో మాత్రం కేంద్రంపై తమవంతు ఒత్తిడి తీసుకువస్తామన్నారు. 2009లో మోసం చేసినట్లుగానే నేడుమరోసారి మోసంచేస్తుందేమో అనే అనుమానం కూడా కలుగుతుందన్నారు. వచ్చేరెండు నెలల్లో సమస్యను పరిష్కరించడం కష్టమైన పనేంకాదన్నారు. ఈసందర్భంగా పాలమూరు కూలీల వలసల పై కూడా స్పందించిన సుస్మాశ్వరాజ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ వేయిమంది కిరణ్‌లు వచ్చినా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు బరిగీసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీరాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, డాక్టర్లక్ష్మణ్, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మినారాయణ, నాగం జనార్దన్‌రెడ్డి, టిజేఎసిచైర్మన్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలోసుస్మాస్వరాజ్ తెలుగులో ప్రసంగం ప్రారంభించి పాలమూరు ప్రజలను కడుపుబ్బ నవ్వించారు.