నచ్చకపోతే నెహ్రూ విడిపోమన్నడు : డీకే అరుణ

తెలంగాణ, ఆంధ్రా ప్రాంతా లను కలిపి ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఇష్టం లేనప్పుడు విడిపో వచ్చన్నారని రాష్ట్రసమాచారశాఖ మంత్రి డీకే అరుణ గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై సీఎం ఇలా నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. విభజన ఇష్టం లేకుంటే తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణకు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఫర్వాలేదుగాని కనీసం వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని అరుణ సిఎంకు హితవు పలికారు. తాను ఏది చెపితే అదే కరెక్ట్ అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలపైనే సిఎంగా నేడు వెలుగుతున్న విషయం మరిచిపోవద్దన్నారు. సోనియాను, పార్టీ అత్యంత ప్రాధాన్యమైన సిడబ్ల్యూసి తీర్మాణాన్ని వ్యతిరేకిస్తుండడాన్ని చూస్తుంటేనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియా తీసుకున్న నిర్ణయాన్ని ఏవిధంగా వ్యతిరేకిస్తారని సిఎంను మంత్రి అరుణ నిలదీశారు. చేతకాకపోతే పదవినుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.



