Monday, 2 November 2026

టెర్రరిస్టుల నెపంతో ముస్లిం యువకులను వేధించొద్దు


– షిండే
న్యూఢిల్లీ: ఉగ్రవాదం పేరుతో అమాయక ముస్లిం యువకులను తప్పుడు కేసుల్లో అరెస్టు చేయకుండా చూడాలని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. అమాయక ముస్లిం యువకులను దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్టు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయని ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో షిండే పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమను లక్ష్యం చేసుకున్నారని, తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ముస్లిం యువకులు భావిస్తున్నారని షిండే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *