
అధిష్టానం వద్ద చక్రం తిప్పుతున్న పీసీసీ చీఫ్
త్వరలో సీఎల్పీ సమావేశం
సీఎంను మార్చే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 1 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల మధ్య వివాదం ముదురుతోంది. సీఎం కుర్చీకి బొత్స ఎసరు తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నా లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అధిష్టానం వద్ద చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెండు ముఖ్యమైన పదవు ల్లో ఉన్న ఈ ఇద్దరూ తలో దారిలో నడుస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఇరుప్రాంతాల నేతలు, సిఎం, పిసిసి అధ్యక్షుడు, డిప్యూటి సిఎంలతో సహా అందరూ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. తీరా జూలై 30న సిడబ్ల్యూసిలో తీర్మాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి పూనకం వచ్చిన వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు. విభజన వల్ల ఇరుప్రాంతాలకు నష్టం కలుగుతుందని కొత్త రాగం అందుకుంటూ సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ వేదికల విూద చెప్పాల్సిన అంశాలను పబ్లిక్ విూటింగుల్లోను, అంతే కాకుండా ప్రెస్విూట్లు కూడా పెట్టి అధిష్టానంపై దాడికి కూడా దిగుతున్నారు. గత అరవై రోజుల్లో ఈయన వైఖరి తీవ్రస్థాయికి చేరుకుంటూ నే ఉంది. ఈయన వ్యవహారాన్ని అతిదగ్గరనుంచి గమనిస్తున్న అధిష్టానం తలనొప్పిగా మారుతున్న ఆయనను ఏంచేయాలనే ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఈలోగా ఆయనకు బద్ద శత్రువుగా ఉన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఉసిగొల్పుతున్నట్లుగా కనిపిస్తోంది. సిఎం సిడబ్ల్యూసి నిర్ణయం శిలాశాసనం కానేకాదంటుంటే బొత్స మాత్రం తప్పనిసరిగా అది శిలాశాసనమే అవుతుందనే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టికి అత్యున్నత నిర్ణాయక కమిటీలోతీర్మాణం చేశాక ఎట్టిపరిస్థితుల్లోనే వెనుకడుగు వేయదని కుండబద్దలు కొట్టినట్లుగానే చెప్పుతున్నారు.అంతేకాక బొత్స కూడా సీమాంధ్రలో తాను కూడా ప్రజలకుఅనుగుణంగా ముందున్నాననే భావనతో దూకుడు పెంచుతున్నట్లు సమాచారం. ఇందులో బాగంగానే ఆయన జోడు పదవుల్లో ఒకటైన మంత్రి పదవిని వదులుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా సిఎం సీమాం ద్ర కాంగ్రెస్‌నేతల్లో మంచినేతగా పేరుతెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న బొత్స ఆంటోని కమిటి హైద రాబాద్‌కు రావాలని వివిద వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని లేఖ కూడా రాశారు. సిఎంవేస్తున్న అడుగులు బొత్సకు తలనొప్పిగా మారుతుండడంతో ఆయన కూడా వేగం పెంచారని సమాచారం. రెండు గ్రూపులుగా ఉన్న సిఎం, బొత్స ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. సిఎం వర్గం నేరుగా అధిష్టానంపై నిప్పులు చెరుగుతుంటే బొత్స వర్గం మాత్రం అలా కాకుండా సంయమనం పాటిస్తూనే సీమాంధ్ర ప్రజలకు అనుగుణంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే సిఎం దూకుడుగా వ్యవహరిస్తూ అధిష్టానంపై యుద్దం ప్రకటిస్తుండగా, బొత్స మాత్రం మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేసుకుని ఆక్రెడిట్ను తానే కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోం ది. సిఎం మాత్రం రాజీనామాలు చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందే తప్ప ప్రయోజనం ఉండదని తన వర్గా నికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను వారిస్తున్నారు. అయితే బొత్స మాత్రం అధిష్టానం అనుగుణంగానే వ్యవహరిస్తున్నాడని, పెద్దలకు చెప్పికుంటూనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం కూడా సాగుతోం ది. ఒక్కమాటలో చెప్పాలంటే అధిష్టానం పెద్దలే బొత్సతో సిఎంకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడిపిస్తున్న ట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా సీమాంధ్రలో పైచేయి సాధించేందుకు మాత్రం ఇటు సిఎం అధిష్టానంపై ఫైర్ అవుతుంటే బొత్సమాత్రం అధిష్టానం ఆదేశాలకులోబడే ప్రజలవైపు నిలబడేందుకు ప్రయ త్నిస్తున్నాడనేది వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కిరణ్ కుర్చీకి బొత్స ఎసరు




