
పాక్ సరిహద్దు చొరబాట్లపై మండిపడ్డ ప్రణబ్
రాష్ట్రపతికి విదేశీ గౌరవ డాక్టరేట్
ఇస్తాంబుల్ :శాంతి భద్రంగా ఉంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బెల్గాంలోని ఇస్తాంబుల్ యూనివర్సిటీ ఆయనకు రాజనీతి శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ దేశమైన అభివృద్ధి చెందా లం టే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ అక్రమ చొరబాట్లపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పాక్ సైనిక బలగాలు వాస్తవాధీన రేఖను దాటి ప్రవేశించడాన్ని ఆయన ఖండించారు. పాక్ తరచూ అక్రమంగా చొరబడి కాల్పులకు తెగబడడం సరికాదన్నారు. కాల్పుల విరమణకు ఆ దేశం కట్టుబడి ఉండాలని కోరారు. భారత్ ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎలాంటి పరిస్థితులైనా సమర్థవం తంగా ఎదుర్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. ఇస్తాంబుల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం అభినందనీయ మన్నారు.
శాంతి భద్రంగా ఉంటేనే దేశాభివృద్ధి




