Tuesday, 3 November 2026

కిరణ్‌ను సాగనంపండి


రాష్ట్రపతి పాలన విధించండి
తెలంగాణకు కరెంట్‌ కష్టాలు పెడితే సహించం
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
కరీంనగర్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) :
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇంటికి సాగనంపి రాష్ట్రపతి పాలన విధించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరావమ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులే దాడులకు పాల్పడేలా రెచ్చగొడుతున్నారని అన్నారు. సీమాంధ్రలో నాయకుల ప్రోద్బలంతోనే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కొనసాగుతుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలే పునరావృతమైతే ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేసి, రాష్ట్రపతి పాలన విధించక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో జరిగే దాడులకు, విధ్వంసాలకు సీఎం కిరణే పూర్తి బాధ్యుడని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏపీఎన్జీఓలు చేపట్టిన సమ్మె రాజ్యాంగ విరుద్ధమని కోదండరాం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ తెలంగాణపై తీసుకున్న సీమాంధ్రలో హింసను ప్రోత్సహిస్తున్న సీఎం కిరణ్‌ తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొ||కోదండరాం నిర్ణయం ఏకపక్షంగా వచ్చింది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు, అందరూ ప్రజాప్రతినిధుల సమ్మతితోనే ఈ నిర్ణయం వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడిన విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణలో కోతలు విధించినా, ఇక్కడి విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు తరలించినా సహించేదిలేదని హెచ్చరించారు. విద్యుత్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఎలాంటి గుర్తింపు లేదని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సమ్మె చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా సీమాంధ్ర ప్రజలు ప్రజాప్రతినిధుల అసత్యవాక్కులు, భయాలు పక్కనపెట్టి తెలంగాణకు సహరించాలని కోరారు. ముఖ్యమంత్రి కుట్రలు చేస్తూ తన బాధ్యతలు నెరవేర్చడం లేదని దక్షిణ రాష్ట్రంలో గ్రిడ్‌ కుప్పకూలితే దానికి బాధ్యత ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వవైఫల్యం వల్లే ప్రజల హక్కులపై ఏక పక్షదాడులు జరుగుతున్నాయని అన్నారు.   జగన్‌, చంద్రబాబు దీక్షలు తెలంగాణ ప్రజల హక్కులపై దాడిగానే చూడాల్సి వస్తున్నదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *